5 August, 2026 | 9:45 PM

21 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు

05-08-2026 09:00 PM

- సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 6 నుంచి 21 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్  పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల నిర్వహణకు ఏసీపీ  అనుమతి పొందాలని సూచించారు. వివిధ కారణాల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధం కొనసాగుతుందని  స్పష్టం చేశారు.