24-01-2026 10:49:48 AM
అబుదాబి: యూఏఈలో(United Arab Emirates) రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతోనే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు ప్రారంభానికి ముందే రష్యా షరతు విధించింది. యుద్ధం ఆపాలంటే డాన్ బాస్ నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాలని రష్యా డిమాండ్ చేసింది. డాన్ బాస్ ప్రాంతం కీలకమైన అంశమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా షరతులు ఎలా ఉన్నా.. చర్చల్లో పాల్గొంటున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధం ముగింపు దిశగా చర్చలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. రేపటి వరకు రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కొనసాగనున్నాయి.