24-01-2026 10:32:12 AM
సిద్దిపేట రూరల్ జనవరి 24: నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. నరసింహ చారి మాట్లాడుతూ… స్త్రీలు పూజించబడే చోట దేవతలు నివసిస్తారని, సమాజంలో ఆడ–మగ అనే తేడా లేకుండా సమానంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలికలు సమానత్వం దిశగా ముందుకు సాగాలని, విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
అనంతరం పాఠశాల గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్ కన్వీనర్ శ్రీమతి స్వరూప మాట్లాడుతూ… ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగులాంటిదని పేర్కొన్నారు. బాలికలు మంచి విద్యను అభ్యసించి గౌరవప్రదమైన జీవన విధానాన్ని గడపాలని సూచించారు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.