6 May, 2026 | 3:16 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

30-06-2025 12:24 AM

మహబూబాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి): మహబూబాబాద్ మండల పరిధిలోని అయోధ్య క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముడుపుగల్లు గ్రామానికి చెందిన చందా అరుణ్ కుమార్ (25) యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మహబూబాబాద్ రూరల్ ఎస్ ఐ దీపిక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రాలీ వాహనం ఇండికేటర్ వేయకుండా మలుపు తిరగడం వల్ల వెనక అరుణ్ కుమార్ ద్విచక్ర వాహనంపై వస్తు ఢీ కొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అరుణ్ కుమార్ మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ లో పనిచేస్తున్నాడు.

ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. మృతుడి తండ్రి రవి  మరణించగా ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న అరుణ్ కుమార్ అకాల మృత్యువాత పడడంతో తల్లి రమ, సోదరుడు కన్నీరు మున్నీరయ్యారు.