29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

విద్యుత్ షాక్‌కు యువకుడు బలి

17-05-2025 12:00 AM

భద్రాచలం, మే 16 (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బస్టాండ్ ఎదుట ఉన్న లాడ్జి ముందు  విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్టాం డ్ ఎదురుగా ఉన్న సామ్రాట్ లాడ్జ్ కి ఏ ర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి క రెంట్ షాక్ తో పక్కనే రూమ్ లో అద్దెకు  ఉంటున్న సోమిడి వంశీ(23) అనే యువకుడు దుర్మరణం పాలయ్యారు.

సామ్రాట్ లా డ్జి ట్రాన్స్ఫార్మర్ పక్కనే వున్న భవనంలో అద్దెకు ఉంటున్న సోమిడి వంశీ  ఉదయమే బ్రష్ చేస్తూ ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి చాలా సేపు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు.లాడ్జి నిర్వాహకులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన విషయంలో సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఈ ఘటనకు దారి తీసింది.

తెల్లవారు జామునుంచే భారీ వర్షం కురవడం, ట్రాన్స్ఫార్మర్ తీగలు పక్కనే ఉం డడం వంశీకి షాక్ తగిలి సుమారు 5 నిముషాల పాటు మృత్యువుతో పోరాడి నట్లు స్థానికులు చెప్తున్నారు.సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలిసులు, పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

మృతుడు ములుగు జిల్లా,వా జేడు మండలం జగన్నాధపురం గ్రామ నివాసి గా గుర్తించారు.మృతుడు పట్టణం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. వంశీ తల్లిదండ్రులు, బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.