అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు
01-06-2026 12:18 PM
నిజాంసాగర్ జూన్ 01(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కోడూరి శ్రీశైలం అగ్ని వీర్ కు అర్హత సాధించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. సామాన్య గొర్రెల కాపరి కుటుంబం నుంచి అగ్ని వీరుకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు ఉద్యోగంతో పాటు దేశ సేవ చేసే భాగ్యం లభించినందుకు సంతోషంగా ఉందని తండ్రి కోడూరి సంగమేశ్వర్ తెలిపారు. మారుమూల ప్రాంతం నుండి దేశ సేవ చేసే అవకాశం లభించడంతో గ్రామస్తులు యువకుడ్ని అభినందిస్తున్నారు.






