18-01-2026 02:28:12 PM
బి ఆర్ ఎస్ హయంలో అవినీతి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్చరిక
షాద్‌నగర్ జనవరి 18, (విజయక్రాంతి): టికెట్ల కేటాయింపు విషయంలో బల ప్రదర్శన చేసే నాయకుల కన్నా, వార్డులో ఉండి నిరంతరం పనిచేసే వారికే ప్రాధాన్యతను ఇస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశం లో అయన మాట్లాడుతు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం ఇవ్వమని, నిజాయితీతో గెలుస్తామని, సత్తా చాటుతామని అన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో బల ప్రదర్శన చేసే నాయకుల కన్నా, వార్డులో ఉండి నిరంతరం పనిచేసే వారికే ప్రాధాన్యతను ఇస్తామని వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పీఠం ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో నమ్మి అధికార పీఠాన్ని ఇచ్చిన వార్డుల అభివృద్ధికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని, అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోనే తాము ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ విషయం వార్డుల్లో ఉండే ప్రజలందరికీ తెలుసు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కచ్చితంగా తమవైపే ఉంటారని ఆయన వ్యక్తం చేశారు.
బి ఆర్ ఎస్ హయంలో అవినీతి
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత మున్సిపాలిటీ పాలకులు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.. పట్టణ ప్రజలకు తెలుసని అన్నారు. ముఖ్యంగా గత పాలకుల మాదిరిగా తమ ప్రభుత్వం హయాంలో ఎవరి ఇండ్లు కూలగొట్టమని, ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయమని, కంకర పోసి కమిషన్లు అడగమని అన్నారు. నిష్పక్షపాతమైన ప్రజా పరిపాలన అందిస్తామని వసూళ్లకు పాల్పడేవారిని ఉపేక్షించమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిజాయితీగా ప్రజాసేవకు కట్టుబడిన వారికి మాత్రమే కాంగ్రెస్ బిఫార్మ్స్ ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబాయ్, అగునూరు విశ్వం, రఘు నాయక్, అగునూరు బస్వం, అందే మోహన్ తదితరులు పాల్గొన్నారు..