13 May, 2026 | 1:24 AM

సోషల్ మీడియా వ్యూస్, లైకుల కోసం యువకుని ఆత్మహత్య డ్రామా

13-05-2026 12:00 AM
  1. పోలీసుల సమయం వృధా చేసినందుకు యువకుడు పై కేసు నమోదు
  2. యువత, విద్యార్థుల కు సోషల్ మీడియా మోజు వద్దు,
  3. కామారెడ్డిలో పోలీసులను తప్పుదోవ పట్టించిన యువకుడు 
  4. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, మే 12 (విజయక్రాంతి): సోషల్ మీడియా  మోజు ఓ యువకుడిని కటకటాల పాలు చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కథనం ప్రకారం వివరాలు  ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చ పేటకు చెందిన  రెడ్లన్ రోహిత్ అనే యువకుడు మంగళవారం ఇంస్టాగ్రామ్ లో తాను ఆత్మహత్య పాల్పడుతున్నానని ఓ యువకుడు భావోద్వేగంతో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

దీంతో పోలీసులు స్పందించి కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ యువకుని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో యువకుడు తాను సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కావాలని ఉద్దేశంతో వీడియో రూపొందించినట్లు రోహిత్ తెలిపారు. పోలీసుల సమయం వృధా చేసినందుకు కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి ఆధ్వర్యంలో ఆ యువకుడు పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేసినందుకు ఆ యువకుడు పై కేసు నమోదు చేసినట్లు ఎస్పి వెల్లడించారు.

సోషల్ మీడియాలో కొన్ని లైకులు వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆత్మహత్య డ్రామాలు చేయడం అత్యంత బాధ్యత రహిత్యం అన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టుకునేలా ముందుకు సాగాలని ఎస్పీ కోరారు. తప్పుదారులు పట్టవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసుల సమయాన్ని వృధా చేసే వారిపై కఠి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.