11 August, 2026 | 1:59 PM

Breaking News

బెంగాల్ సర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు   •   ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •  

మాదాపూర్ దుర్గంచెరువులో యువతి ఆత్మహత్య

20-06-2025 12:00 AM

శేరిలింగంపల్లి, జూన్ 19: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృత దేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ అడ్డగుట్టకు చిందిన బి. సుష్మ (27) హైటెక్ సిటీలో ఉన్న డైబోల్డ్, నిక్షి డో రఫ్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నది. అయితే 18వ తేదీ కూడా ఉద్యోగానికి వెళ్ళింది అయితే ఎంతకి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి అంజయ్య ఆఫీస్ మేనేజర్‌ను సంప్రదిస్తే ఆఫీస్ నుండి వెళ్లి పోయిందని తెలిసింది.

దీంతో గురువారం ఉదయం 7.00 గం.లకు దుర్గం చెరువులో తప్పిపోయిన మహి ళ సుష్మ మృతదేహం తేలుతున్నట్లు సమాచారం అందింది. ఎన్డీఆర్‌ఎఫ్ సాయంతో పోలీసులు శవాన్ని స్వాధీ నం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు ఆత్మహత్య చేసుకున్నదా లేదా ఎవరైనా తోసేశారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.