రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్
26-06-2025 10:37 AM
గమనించి ట్రైన్ ఆపిన లోకో పైలెట్
చేవెళ్ల: రైలు పట్టాలపై ఓ యువతి కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది. గురువారం ఉదయం రామచంద్రపురం మండలం(Ramachandrapuram Mandal) నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వైపు వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నడుతుపుతుండగా.. స్థానికులు గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పట్టించుకోకుండా మరింత వేగంగా దూసుకెళ్లింది. ఈ సమయంలో అదే పట్టాలపై రైలు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కానీ, లోకో పైలెట్ గమనించి ట్రైన్ ను నిలిపివేశాడు. తర్వాత ఆమెను పట్టుకొని కారును పక్కకు తీశారు. సమాచారం అందుకున్న శంకర్ పల్లి పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






