11 July, 2026 | 9:37 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దాబాలపై పోలీసుల దాడులు

26-06-2025 10:35 AM
  1. మద్యం సిట్టింగులు నిర్వహించిన దాబాల నిర్వాకులపై కేసులు నమోదు 
  2. 171 మద్యం బాటిల్లు స్వాధీనం
  3. మద్యం సేవించిన 71 మందిని  అదుపులోకి తీసుకున్న పోలీసులు
  4. దాబాల నిర్వాకులకు షాక్ ఇచ్చిన పోలీసులు 
  5. విజయ క్రాంతి వార్త కు స్పందన

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని దాబాల్లో మద్యం సిట్టింగ్ ల జోరు అనే శీర్షికతో విజయ క్రాంతి దినపత్రిక(Vijayakranthi Daily)లో వచ్చిన కథనానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పందించారు. జిల్లాలోని 161వ జాతీయ రహదారిపై ఉన్న దాబాలపై ఏకకాలంలో బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. మద్యం సిట్టింగ్ జోరుగా సాగుతున్న దాబాలలో నిలువ ఉంచిన మద్యం బాటిల్లను, స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవిస్తున్న వారిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు. 171 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకొని 71 మందిని అదుపులోకి తీసుకున్నారు.

161 వ జాతీయ రహదారిపై ఉన్న ఆరు దాబాలపై పోలీసులు ఏకకాలంలో నాలుగు బృందాలుగా  వెళ్లి దాడులు నిర్వహించడంతో మద్యం  సిట్టింగ్ లు నిర్వహిస్తున్న దాబా యజమానులు నీవ్వే రా బోయేలా చేశారు. తాము నెలసరి మామూలు స్థానిక పోలీస్ అధికారులకు ముట్ట చెబుతుండగా పోలీసులు వచ్చి దాడులు నిర్వహించడం ఏమిటని దాబా నిర్వాహకులు నీవ్వేరా పోయారు. మరోవైపు స్థానిక నాయకుల అండదండలు మరోవైపు పోలీసుల అండ దండలు ఉండడంతో ఏదేచ్ఛగా బహిరంగంగా మద్యం సిట్టింగులను దాబాల  యజమానులు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారుల పక్కన ఉన్న దాబాలో కాకుండా మండల కేంద్రాల్లో ఉన్న దాబాల్లో సైతం మద్యం సిట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి.

కామారెడ్డి జిల్లాలోని 161వ జాతీయ రహదారి పై అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న డాబాలపై  ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లాలో 4 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటుచేసి సిట్టింగ్ నిర్వహిస్తున్న దాబాలపై ఏకకాలంలో దాడులు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న 6 దాబాల్లో తనిఖీ చేయగా 132 మద్యం బాటిల్లు  71 మందిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. అనుమతులు లేకుండా దాభాల నిర్వహకులు మద్యం సిట్టింగులు నిర్వహిస్తే యజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజేష్  చంద్ర తెలిపారు.

వాహనాలు నడిపి ప్రమాదాలు

దాబాలలో మద్యం సిట్టింగులు నిర్వహిస్తుండడంతో మద్యం ప్రియులు దాబాల్లో మద్యం సేవించి రాత్రి వేళలో ఇంటికి వెళుతున్న సందర్భంలో మద్యం మత్తులో వాహనాలు నడిపి  రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలల్లో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు.  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేషనల్ హైవేపై ఉన్నటువంటి డాబాల లో మద్యం అమ్మకాలు  చేయడం నేరమని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఉద్దేశంతో ఏకకాలంలో అన్ని డాబాలపై దాడులు నిర్వహింఛీ నట్లు తెలిపారు.

దాబాల్లో మద్యం సెట్టింగ్ నిర్వహించవద్దు 

ఇకపై జిల్లాలో ఎవరు కూడా డాబాల లో మద్యం అమ్మకాలు, చేపట్టవద్దని, మద్యం సేవించడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేస్తే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర  తెలిపారు.