calender_icon.png 23 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపోల్స్‌లో మీ చెంప చెల్లుమంటది

23-01-2026 01:01:07 AM

బీఆర్‌ఎస్‌పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీకి పోయే దమ్ములేని కేటీఆర్.. రేవంత్ గురించి మాట్లాడతారా.. కేటీఆర్ ఓ దద్దమ్మ అని ఫీషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మీ చెంప చెల్లుమనిపిస్తారని విమర్శించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు బావ, బామ్మర్దులని హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు మీ ఇంట్లోకి.. రాష్టాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం’ అని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 10 కిలోమీరుర్ల గోతిలో బొందపెట్టినా బుద్ధి మారడంలేదన్నారు. ‘రేవంత్‌రెడ్డి కరెక్ట్ ఫోకస్ చేస్తే మీ బీఆర్‌ఎస్ పార్టీ నామ రూపా లు లేకుండా పోతది. తెలంగాణ రాష్టంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. నడిరోడ్డుపై ఉరికించి కొడ్తామ్ బిడ్డ మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి అడ్డగోలిగా మాట్లాడితే’ అని హెచ్చరించారు. ‘దావోస్ పర్యటన గురించి మాట్లాడతారా? వేల కోట్ల నిధులు తెస్తుంటే కండ్లు మండుతున్నాయా’ అని నిలదీశారు.