calender_icon.png 23 January, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రవల్లిలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ

23-01-2026 01:03:22 AM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. న్యాయపరమైన అంశాలు, రాజకీయ వ్యూహాలపై చర్చ

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ క్రమంలో గురువారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కీలకంగా సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నిన్న హరీశ్‌రావు సిట్ విచారణకు హాజరైన నేపథ్యం లో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ విచారణ ముగిసిన మరుసటి రోజే పార్టీ అగ్రనేతల భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హరీశ్ రావును సిట్ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమా ధానాలపై హరీశ్‌రావు కేసీఆర్, కేటీఆర్‌తో చర్చించినట్లు సమాచారం. సిట్ విచారణలో అడిగిన ప్రశ్నల స్వరూపం, కేసు దిశ ఏ వైపు వెళ్తోంది అనే అంశాలపై ముగ్గురు నేతలు లోతుగా సమీక్షించినట్లు పార్టీ వర్గా లు చెబుతున్నాయి. ఈ భేటీలో ఫోన్ ట్యాపింగ్ కేసు లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసింది.

అలాగే కేసును రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, పార్టీ శ్రేణుల్లో గందరగోళం రాకుండా ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై కూడా చర్చిం చినట్లు సమాచారం. సిట్ విచారణ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇవ్వాల్సిన సందేశంపై కూడా ముగ్గురు నేతలు సమాలోచనలు చేసినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొందరు ‘పెద్దాయన ఆదేశాల మేరకే’ అని చెప్పినట్లు ప్రచారం జరగ డంతో, ఈ కేసులో తదుపరి నోటీసులు ఎవరికీ జారీ అవుతాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్ అగ్ర నేతల భేటీ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది.