బీరు సీసాతో యువకుడిపై దాడి
06-03-2026 01:32 AM
మిర్యాలగూడ, మార్చి 5 : పట్టణంలోని సుందర్ నగర్ కాలనీలో బీరు సీసాతో యువకుడి పై దాడి ఘటన జరిగింది. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ నాగభూషణ రావు తెలిపిన వివరాల ప్రకారం....సుందర్ నగర్ కాలనీ కి చెందిన ఎల్తూరి అఖిల్ అనే యువకుడు వీధిలో నడుచుకుంటూ వస్తుండగా అదే కాలనీ కి చెందిన అన్నదమ్ములు పందిరి ఆకాష్, వికాస్ లు పాత గొడవ దృష్టిలో ఉంచుకొని అఖిల్ ని దుర్భాషలాడి గొడవ పడ్డారు. పారి పోయందుకు యత్నించిన అఖిల్ పై ఆకాష్ బీరు సీసాతో దాడి చేసి మెడపై పొడిచి హత్యాయత్నం చేశాడు. విషయం తెలిసిన పోలీసులు బాధితున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి నిందితులపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.




