calender_icon.png 3 November, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

02-11-2025 08:07:27 PM

మర్పల్లి (విజయక్రాంతి): మర్పల్లి మండలంలోని కోత్లాపూర్ గ్రామానికి చెందిన చామల మోహన్ రెడ్డి(32) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోవా వెళ్తానని ఇంట్లోవారికి చెప్పిన మోహన్ రెడ్డి ఇతరుల పొలం వద్ద ఉరేసుకున్నాడు. కుళ్లిన వాసన వస్తుండటంతో పొలం యజమానికి వెళ్లి రేకుల షెడ్డులో చూడగా మోహన్ రెడ్డి ఉరేసుకొని ఉన్న మోహన్ రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే యజమాని ఈ విషయాన్ని వారి కుటుంబసభ్యలకు తెలిపాడు. అయితే ఐదారు రోజుల క్రింద ఉరేసుకోవడంతో మృతదేహం కుళ్లిపోయింది. సమాచారం అందుకున్న మర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.