calender_icon.png 3 November, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం... అవస్థలు పడిన రైతులు

02-11-2025 08:03:12 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): అకాల వర్షం కురియడంతో రైతులు అవస్థలు పడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఉదయం నుంచి వర్షాలు పడడంతో వరి ధాన్యం కల్లాలలో ఉండడంతో తడిసి ముద్దయింది. ఎండ కొడుతూ ఒకేసారిగా మబ్బులు వచ్చి వర్షం కురియడంతో గాలి వాన రావడంతో కల్లాలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయినట్లు రైతులు తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షం కురిసింది. మండలంలోని జంగంపల్లి ఉర్దూ లక్ష్మాపూర్ రాంపూర్ కొట్టాల్ గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షం రావడంతో వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం చేతికి వచ్చి అమ్ముకునే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.