2 July, 2026 | 3:01 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

30-04-2025 12:00 AM
  1. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్
  2. నాగోల్ లో యూత్ కాంగ్రెస్ సమావేశం

ఎల్బీనగర్, ఏప్రిల్ 29 : పార్టీకి యువతే బలమని, యూత్ కాంగ్రెస్ ను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను అంతమొందించడంలో యువజన కాంగ్రెస్ ఎంతో కీలకంగా పని చేసిందని, కష్టపడిన నాయకులను గుర్తించి  పార్టీ తప్పకుండా ప్రోత్సహిస్తుంద న్నారు.

యూత్ కాంగ్రెస్ రాష్ర్ట విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం మంగళవారం నాగోల్ డివిజన్ రాక్ హిల్స్ కాలనీలోని ఎస్వీఎల్ ఎరీనా కన్వెన్షన్ లో జరిగింది. ఈ సందర్భంగా మధు యాష్కీగౌడ్  మాట్లాడుతూ... రాష్ర్టంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే యూత్ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాలన్నారు. దేశంలో బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్ ను ఎదుర్కొనేందుకు యువజన కాంగ్రెస్ కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆ శక్తి యువజన కాంగ్రెస్ కే ఉందనేది నేను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు.  బూత్ స్థాయి నుంచి యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేసినప్పుడే... కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఉంటుందన్నారు. యువజన కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి వారిని నాయకులుగా ప్రోత్సహించే  బాధ్యత తమదని పేర్కొన్నారు. 

భవిష్యత్తు అంతా యువజన కాంగ్రెస్ నాయకులదే అని.. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో యువజన కాంగ్రెస్ తమదైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ఇన్ చార్జి కృష్ణ అల్లవాను, యువజన కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.