2 March, 2026 | 5:20 AM

యువత మత్తు పదార్థాలు, మద్యానికి బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత యువజన సంఘాలది

02-03-2026 01:55 AM

రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ 

ఘట్ కేసర్, మార్చి 1 (విజయక్రాంతి) : మత్తు పదార్థాలు మద్యం పానీయాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత యువజన సంఘాలపై ఉన్నదని రాజ్యసభ సభ్యులు కె .లక్ష్మణ్ అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన లాల్ బ హదూర్ స్మారక యువజన సంఘం భవ నం ను ఎంపీ లక్ష్మణ్ ఆదివారం మాజీ మం త్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘట్ కేసర్ ప్రాంత పోలిమేరలో కూడా మత్తు పదార్థాలు లేకుం డా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు.

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులుగా దేశ అభివృద్ధికి అలాగే ఘట్ కేసర్ పట్టణ బిడ్డగా ఘట్ కేసర్ ప్రాంత అభివృద్ధికి తన శాయశక్తుల సహకారాన్ని, సేవలను అందిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంత అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు అందించాలని పేర్కొన్నారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి నిధు ల విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి కోరుతానని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను సంఘం అధ్యక్షులు బ్రహ్మం శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఘట్ కేసర్ పట్టణంలో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరం కు వచ్చిన ప్రజలకు ఆరోగ్య పరీక్షలతో పాటు వారికి కావాల్సిన మందులు ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమాలలో రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు బండారి దాసు గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, రైతు సొసైటీ మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి,

మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మగోని రమాదేవి, బండారి ఆంజనేయులుగౌడ్, కొమ్మిడి అనురాధ, జహంగీర్, బేతాళ నర్సింగ్ రావు, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, రైతు సొసైటీ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు నాగులపల్లి రమేష్, పన్నాల కొండల్ రెడ్డి, నాయకులు మేకల దాసు, మారం లక్ష్మారెడ్డి, వేముల సంజీవ గౌడ్, చందుపట్ల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.