calender_icon.png 17 June, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాపూర్ లో ఊపందుకున్న జాతర ఉత్సవాలు..

16-06-2025 07:46:41 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండల ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో ఆదివారం నుండి మొదలైన జాతరోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ జిన్నా స్వామి, గ్రామ పెద్దలు పని బాటలవారి సమక్షంలో సోమవారం ఊరడమ్మకు గావులు, రంగాల కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం బొడ్రాయికి జలాభిషేకం చేసి పనిబాటల వారి సమక్షంలో పెద్దచేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నాయకుడు నవీన్ యాదవ్, జిన్న రాజు, జి కృష్ణ, పల్లెపాటి అశోక్, మన్నె తిరుపతి, నాగరాజు, శేఖర్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.