calender_icon.png 18 August, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

18-08-2025 12:37:04 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు 17 : సమాజంలో యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అర్వపల్లి ఎస్సు ఈట సైదులు అన్నారు. నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆదేశానుసారం ఆదివారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మత్తు రహిత సమాజ స్థాపన కోసం తన వంతు కృషి చేస్తున్న.

జిల్లాలోని మద్దిరాల మండలం గోరంట్ల జడ్పిహెఎస్ లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సామాజిక ఉద్యమకారుడు రాచకొండ ప్రభాకర్ తో కలిసి యువతకు,ప్రజలకు డ్రగ్స్, గంజాయి, రోడ్డు ప్రమాదాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ రామకోటి, పోలీసు సిబ్బంది అశోక్,రామన్న,యువకులు తదితరులు పాల్గొన్నారు.