calender_icon.png 18 August, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టుకుందాం

18-08-2025 12:39:39 AM

తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ర్ట అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

కోదాడ ఆగస్టు 17: ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ బడులను నిలబెట్టుకోవాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ర్ట అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.

ఆదివారం కోదాడ పట్టణంలో జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో కొత్త ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆ పాఠశాలలను ఇరుకైన గదుల్లో కాకుండా ఆకర్షణీయమైన భవనాలలో ప్రారంభించాలన్నారు.

ముఖ్యమంత్రి నుండి అందరూ ప్రజా ప్రతినిధులు అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో నే చదివించాలన్నారు. మంచి ఉపాధ్యాయులను ప్రోత్సహించి పైరవీకారాలను దూరం పెట్టాలన్నారు.

ఈ సమావేశంలో రాష్ర్ట ఉపాధ్యక్షులు కె.ఎ. మంగ, రాష్ర్ట కమిటీ సభ్యులు నాగమణి,జిల్లా అధ్యక్షులు ధనమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు వీరారెడ్డి, కోదాడ డివిజన్ అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి వీరబాబు, కోశాధికారి ఖాజామియా, రామమూర్తి,వేంకటేశ్వర రెడ్డి, వెంకట నారాయణ,కరుణాకర్ పాల్గొన్నారు....