18-08-2025 12:34:06 AM
యాదగిరిగుట్ట ఆగస్టు 17 విజయక్రాంతి : ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు తన సొంత గ్రామం సైదాపురం లో బీరప్ప పండుగకు డోలు వాయించి ప్రారంభించారు. బీరప్పకు మరియు గ్రామ దేవత వనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు ప్రముఖులు పాల్గొన్నారు , స్వయంగా ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులతో బోనాన్ని సమర్పించడం జరిగింది.