28-01-2026 12:00:00 AM
మేడ్చల్ అర్బన్ జనవరి 27(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం తండాకు చెందిన వివిధ యువజన సంఘాల నాయకులు యువకులు,భాజాపా తీర్థం పుచ్చుకున్నారు.మంగళవారం రాజ బొల్లారం తండా కు చెందిన పలువురు యువకులు యువజన సంఘాల నాయకులు తాండ లోని బంజారా యువజన సంఘం నాయకులు నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపి ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి లో చేరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గిరిజనుల అభివృద్ధికి ఎంతో పాటు పడుతున్నారని మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు యువకులు ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు.అంతే కాకుండా ఎల్లంపేట్ మున్సిపల్ పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎస్టీ మహిళా రిజర్వేషన్ కావడంతో ఎట్టకేలకు మున్సిపల్ ను కైవసం చేసుకోవాలని ఆయన యువకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్.జిల్లా బిజెపి ఇన్చార్జి సామ రంగారెడ్డి.బిజెపి రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రం రెడ్డి.జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణ గౌడ్ గౌరారం జగన్ గౌడ్.బిజెపి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్.మున్సిపల్ బిజెపి పట్టణ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ బిజెపి పార్టీలో చేరిన యువకులు నవ బంజారా యూత్,వేణు శివాజీ యూత్,గౌతమ్ బంజారా యూత్ యువకులు సిద్దు సకృనాయక్.రవి నాయక్.రోహన్.శ్రీనివాస్ నాయక్. రాకేష్. వినోద్. సంపత్. దుర్గ. విష్ణు.శ్రీధర్.నర్సింగ్.సురేష్.వంశీ తదితరులు పాల్గొన్నారు.