calender_icon.png 28 January, 2026 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

28-01-2026 12:00:00 AM

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, జనవరి 27(విజయ క్రాంతి): మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా నిర్వ హించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశిం చారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఇంచార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.

నామినేషన్ల స్వీకరణకు ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చే స్తున్నారని, వాటిలో ఎలాంటి సౌకర్యాలు క ల్పిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.నామినేషన్ల దా ఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, సహాయార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్‌ఓసీ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.సందర్శనలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు ఉన్నారు.