07-08-2024 02:01:58 AM
ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. మంగళవారం ఆ సంస్థ సీఈవో నీల్ మెహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కంటెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రొగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడమీలో పరిశోధనలు చేయవచ్చని చెప్పారు. అమరావతిలో భాగమైన మీడియా సిటీలో దీనిని ఏర్పాటు చేయాలని కోరారు.