calender_icon.png 16 July, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెట్టెంపాడు ఫేజ్-1 పంపుల మొరాయింపు

07-08-2024 02:33:23 AM

ఆగిన ఎత్తిపోతల 

గద్వాల (వనపర్తి), ఆగస్టు 6 (విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గంలోని అతి పెద్ద సాగునీటి ఎత్తిపోతల పథకం నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ఫేజ్ -1లో సాంకేతిక సమస్యతో జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే పంపులు సోమవారం రాత్రి నుంచి ఆగిపోయాయి. పంపులకు అం దించే ముఖ్యమైన సర్క్యూట్‌లో స్టాటికల్ ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ (ఎస్‌ఎఫ్‌సీ) సమస్య కారణంగా నీటి ఎత్తిపోసే పంపులు ఆగిపోయాయని సమాచారం.

ఈ సాంకేతిక సమస్యను నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న పంపులను బీహెచ్‌ఈఎల్ కంపెనీ మాత్రమే సరిదిద్దేందుకు అవకాశం ఉందని, అయితే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి 13 లక్షలు బాకి పడిందని.. ఇంతవరకు మెయింటెనెన్సు పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు  బీహెచ్‌ఈఎల్ ముందుకు రావడం లేదన్నది సమాచారం.