25 July, 2026 | 10:14 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

జీబ్రా సినిమాకు కథ కోసం రావాలి

21-11-2024 12:00 AM

హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేశ్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటిస్తు న్నారు. ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ బుధవారం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “జీబ్రా’ నా గత సినిమాలకు భిన్నంగా ఉండే పాత్ర. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్. మా ఈ సినిమాకు కథ కోసం రావాలి’ అని చెప్పారు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ నడిచే కథ ఇది. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథ రాశాను.

డిజిటల్ క్రైమ్‌ను లైమ్‌లో పెట్టి సినిమా చేశాం. ఇందులో బ్యాంకింగ్, గ్యాంగ్‌స్టర్, మనీ లాండరింగ్ ఇలా మూడు వరల్డ్స్ ఉంటాయి’ అని తెలిపారు. నిర్మాతలు ఎస్‌ఎన్ రెడ్డి, బాల సుందరం, ఎడిటర్ అనిల్, చిత్రబృందం పాల్గొన్నారు.