నిజాయితీగా పనిచేస్తే ఇండస్ట్రీ అన్యాయం చేయదు
అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మించారు. సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో సుధీర్‌బాబు, గల్లా జయదేవ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘నిజాయితీగా పనిచేస్తే ఈ పరిశ్రమ అన్యాయం చేయదు. నిజాయితీగా ఉన్న అశోక్ గ్యారెంటీగా నిలబడతాడు’ అన్నారు. ‘ఈ సినిమాతో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతానని నమ్ముతున్నా’ అని హీరో అశోక్ అన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్‌టైనర్’ అన్నారు. ‘ఈ మూవీతో సినిమా గురించి చాలా నేర్చుకున్నాను’ అని హీరోయిన్ మానస అన్నారు. డైరెక్టర్ అజయ్ భూపతి, ఆర్ట్ డైరెక్టర్ జీఎం శేఖర్, మూవీ యూనిట్ పాల్గొన్నారు.






