విద్యార్థులకు రెండో విడత విద్యాసామాగ్రి పంపిణీ

10-11-2026 | 04:26pm

ఖానాపూర్ (విజయక్రాంతి ) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality, Nirmal District) ఏడవ వార్డులో అంగన్వాడి పాఠశాలలో(Anganwadi school) విద్యార్థులకు రెండవ విడత విద్యా సామాగ్రి పంపిణీ(Distribution of educational supplies) చేశారు. అవార్డు కౌన్సిలర్ నిమ్మల రమేష్ విద్యార్థులకు(Students') ఈ సామాగ్రి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందాలనే ఆశయంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, అడ్డగట్ల రాజన్న, లింగాల రాములు, రామ్ భీమన్న, లింగాల లక్ష్మణ్, ఎన్నం ఆనంద్, ఉపాధ్యాయులు అనిల్ కుమార్ ,ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు