పాదయాత్రకు స్వాగతం
నిర్మల్ నవంబర్ 29 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(BRS chief Kalvakuntla Chandrashekar Rao) తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆదిలాబాద్ కు చెందిన ప్రశాంత్ చేపట్టిన పాదయాత్ర నిర్మలకు చేరుకుంది. అదిలాబాద్ నుండి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర జరగనుంది. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ పాదయాత్రకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
సుమారు 350 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. పాదయాత్రకు స్వాగతం పలికిన వారిలో బీఆర్ఎస్ నాయకులు మారుగొండ రాము, మహమ్మద్ నజీర్ ఉద్దీన్, గండ్రత్ రమేష్, అక్రమ్ అలీ, మాసూద్, జుబేర్, ఆకాష్, పూదరి శివ, సయ్యద్ ఖాజా, విశాల్, మహబూబ్, భీమేష్, ఓం ప్రకాష్, ప్రశాంత్, బబ్లు, హరీష్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.