దాడిని నిరసిస్తూ నిరసన ర్యాలీ

21-11-2026 | 05:21pm

ఖానాపూర్,(విజయక్రాంతి): నల్గొండ(Nalgonda) పట్టణంలో పారిశుధ్య కార్మికురాల(Sanitation Worker)పై జరిగిన దాడిని నిరసిస్తూ సిఐటియు నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ(Protest rally) నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

మున్సిపల్ కార్మికురాలు అరుణమ్మపై దాడి చేసిన బాలకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చుంచుల. నారాయణ, మున్సిపాలిటీ యూనియన్ గౌరవాధ్యక్షులు జావిద్, యూనియన్ కార్యదర్శి గంగాధర్, కోశాధికారి శంకరమ్మ, నాయకులు అమీర్ నరేష్, రవి, నాగరాజ్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు