చింతకుంట ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

21-11-2026 | 05:19pm

కొత్తపల్లి, నవంబర్ 21(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం(Karimnagar town) 14వ డివిజన్ చింతకుంటలో డీసీఎంఎస్(DCMS in Chintakunta) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain purchasing center) కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Karimnagar Agricultural Market Committee) చైర్మన్ ఆకుల నర్సన్న పటేల్(Akula Narsanna Patel), 14 వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు(Farmers) రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి రావొద్దని సూచించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మేనేజర్ శివనాగిరెడ్డి, ఏఈఓ ఫజిల్, ప్రజా ప్రతినిధులు, నాయకులు,డిసిఎంఎస్ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు