వడ్డేమాన్ శనేశ్వర స్వామికి అభిషేకాలు

21-11-2026 | 05:11pm

బిజినేపల్లి: మండలంలోని నంది వడ్డేమాన్ శ్రీ శనేశ్వరస్వామికి ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి చేతుల మీదుగా భక్తులకు అష్టమ, అర్థాష్టమ, ఏలినాటి శనిగ్రహ దోష నివారణకు శనివారం ప్రత్యేకంగా తిల తైలాభిషేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య  బ్రహ్మసూత్రం పరమ శివునికి నందీశ్వర స్వాములకు భక్తులచే రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమా మహేశ్వరులు భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ  చేశారు.


మరిన్ని వార్తలు