వైపర్‌లో విష్ణు కప్–2026 క్రీడా పోటీలు ప్రారంభం

21-11-2026 | 05:14pm

యువత వీడియో గేమ్స్‌కు దూరంగా ఉండాలి..

క్రీడలతోనే ఆరోగ్యం, మానసిక ఉల్లాసం : సీఐ రంగా కృష్ణ

నర్సాపూర్: నర్సాపూర్(Narsapur ) సమీపంలోని విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (వైపర్) కళాశాల(Vishnu Institute of Pharmaceutical Education and Research College)లో విష్ణు కప్–2026 క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు వారం రోజులపాటు జరిగే ఈ పోటీల్లో వివిధ ఫార్మసీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ సీఐ రంగా కృష్ణ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.

యువత వీడియో గేమ్స్‌కు బానిసలు కాకుండా మైదాన క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వైపర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. రమేష్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తితో పాల్గొనడం, ఆటను ఆస్వాదించడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ పోటీల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, త్రోబాల్, కబడ్డీ తదితర క్రీడలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుణ్, బీవీఆర్ఐటీ ప్రిన్సిపల్ సంజయ్ దూబే, అధ్యాపకులు, నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు