ప్రమాదవశాత్తు చేయి విరిగిన రిపోర్టర్‌కు సీపీఐ నాయకుల పరామర్శ

21-11-2026 | 05:15pm

నల్లబెల్లి, నవంబర్ 21 ( విజయ క్రాంతి): ప్రమాదవశాత్తు(Accidentally) చేయి విరిగి విశ్రాంతి తీసుకుంటున్న 'మన విశ్వం' రిపోర్టర్ మూడు రవిని శనివారం సీపీఐ నాయకులు(CPI leaders) పరామర్శించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి, మండల కార్యదర్శి పరికి కోర్నేలు తదితరులు రవి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని(Health condition) అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ. రవి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, తిరిగి ప్రజాక్షేత్రంలో తన పాత్రికేయ విధులను(Journalistic duties) కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వైనాల జంపయ్య, సామాల లక్ష్మీనారాయణ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు