ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
పదివేల రూపాయల నగదు డిమాండ్, రెడ్ హ్యాండ్ గా పట్టివేత
మానకొండూరు, నవంబర్ 21 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) మరో అవినీతి(Corruption) తిమింగలం ఆనిశా కు చిక్కింది. 'కాదేదీ కవిత కనర్హం' అన్నట్లు వితంతు పింఛన్(Widow pension) లో సైతం కాసులకు కక్కుర్తి పడి, లబ్ధిదారు రాలిని వేధించటం, వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన లబ్ధిదారురాలి(Female beneficiary) మామ ఏసీబీ అధికారులకు(ACB officials) సమాచారమిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ(Lakshmipur Gram Panchayat) కార్యదర్శి లవుడ్యా చవన్ లాల్ శనివారం పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఏసీబీ ఏసీపీ మహేందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజిరెడ్డి కోడలు వితంతు పింఛను కోసం కార్యదర్శిని సంప్రదించగా, నీకు ఆరు ఎకరాల భూమి, ట్రాక్టర్ ఉందని, మీకు పింఛన్ రాదని పదివేల రూపాయలు ఇస్తే వితంతు పింఛను మంజూరు చేస్తానని చెప్పాడు. వితంతు పింఛన్ మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చిన తర్వాత, పై అధికారులకు డబ్బులు ఇవ్వాలని ఈనెల 16, 17, 19 తేదీలలో ఫోన్ చేయడం, బాధితురాలు ఇంటికి వెళ్లి డబ్బులు అడగడంతో 5,000 రూపాయలు తీసుకోవడానికి నిరాకరించాడు.
వేధింపులు ఎక్కువ కావడంతో, లబ్ధిదారురాలి మామ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజిరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. శనివారం రాజిరెడ్డి ఇంట్లో పదివేల రూపాయల నగదును పంచాయతీ కార్యదర్శి లెక్కిస్తుండగా ఏసీబీ అధికారులు ఏసీబీ ఏసిపి మహేందర్ ఆధ్వర్యంలో సిఐ లు తిరుపతి, ప్రేమ్ కుమార్ లు దాడి చేసి పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు మానకొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పింఛనుల వివరాలు సేకరించి కార్యదర్శి ఏసిబి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. లక్ష్మీపూర్ గ్రామానికి 17 వితంతు, 20 వికలాంగుల పింఛన్లు మంజూరు కాగా 20 మంది లబ్ధిదారుల నుండి 10, 000 రూపాయలు చొప్పున సుమారు రెండు లక్షల రూపాయలు వసూలు చేశాడని వీటిపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.