స్వప్న మల్టీస్పెషల్టి హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం
నిర్మల్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యం అందించేందుకు స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(Swapna Multi Specialty Hospital) వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందినీయమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్(Both MLA Anil Yadav) అన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలో గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని స్వప్న హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున గిరిజనులు ప్రజలు తరలిరాగా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. మొత్తం వెయ్యి మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి స్వప్న హాస్పిటల్ తో మెరిగిన వైద్యం అందిస్తామని రోగులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాలం స్వప్న శశికాంత్, గుండె వైద్య నిపుణులు కిషన్, ఆర్థోపెడిక్ చేతన్, జనరల్ సర్జన్ అశోక్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు