పట్టణ అభివృద్ధికి కృషి చేయండి
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక
ఖానాపూర్ (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipal) అభివృద్ధికి కృషి చేయాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక(Ankam Mounika) అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మున్సిపాలిటీకి నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ రవిబాబు చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాగా ఇంతవరకు ఖానాపూర్ కమిషనర్ గా పనిచేసిన సుందర్ సింగ్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్ ఇన్చార్జ్ బాధ్యతలు స్వీకరించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్కు కమిషనర్ పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.