చలో ఢిల్లీ విజయవంతం చేయాలి

14-11-2026 | 04:49pm

భైంసా ( విజయక్రాంతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) ఆధ్వర్యంలో 'చలో ఢిల్లీ పోస్టర్'(Chalo Delhi poster) విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కోఆర్డినేటర్ అమరవేణి నర్సాగౌడ్, నాయకులు ఈసవేణి మనోజ్ యాదవ్, డా:సుభాష్ రావు, ఆకుల సుదర్శన్, యాటకారి సాయన్న మాట్లాడుతూ బీసీల జనబేరి పేరిట జాతి జనగణనలో ఓబీసీ కులగణన  చేపట్టాలని దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని బిసి జనాభా కుల జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటాలు కల్పించాలని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది అన్నారు.

ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా  డిసెంబర్ 14 వ తేదీన ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో జరిగే బీసీల జనభేరి సభను విజయవంతం చేయాలని పై నాయకులు పిలుపునిచ్చారు. అలాగే బీసీ ఉద్యమ నేత తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు దాడికి పాల్బడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ దాడిని బీసీ సమాజం పై జరిగిన దాడీగా పరిగనించాల్సి వస్తుంది అన్నారు దాడికి భాద్యులను అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెప్పడతామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలొ  బొంగు గంగాధర్ గౌడ్, ఆకుల నర్సయ్య, సుంచు వెంకన్న, పాడాల రాజేందర్ గౌడ్, ఆకుల నర్సయ్య, బెజ్జారం అంబదాస్, ముత్యంపేట లక్ష్మీనారాయణ, తిగేల వెంకట్ గౌడ్,రాజుల దేవి శ్రీనివాస్, బాల గంగాధర్, సుంకరి పోతన్న, పలాజీ పండరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు