భూముల రీ సర్వే వివాదరహితంగా చేపట్టాలి
నిర్మల్ నవంబర్ 28 ( విజయక్రాంతి): భూముల రీసర్వే(Resurvey of lands) నిర్వహణలో ఎటువంటి వివాదాలకు తావు ఉండకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం నిర్మల్ అర్బన్ మండలం విశ్వనాథ్ పేట్ సమీపంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు.
రీ సర్వే ప్రక్రియ పై అధికారులకు పలు సూచనలు చేశారు. రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలన్నారు. రీ సర్వే చేపట్టిన వెంటనే సంబంధిత భూముల యజమానులకు వివరాలు అందించాలన్నారు. రీ సర్వే వివరాలన్నింటినీ క్షుణ్ణంగా నమోదు చేయాలని తెలిపారు. రికార్డుల నమోదులో తప్పులు ఉండకూడదని వెల్లడించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ రాజు, సర్వే అధికారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.