యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయ్యాలి

28-11-2026 | 06:31pm

ఎంఏవో 

సిర్గాపూర్ నవంబర్ 28(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గామ గ్రామానికి వ్యవసాయ అధికారి(Agricultural Officer) (MAO) హరికృష్ణ శనివారం సందర్శించి రైతులకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో భూగర్భ జలాల(Groundwater) నీటిమట్టం తగ్గుతున్న దృష్ట్యా రైతులు(Farmers) వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ఆయన అవగాహన కల్పించారు.

వ్యవసాయ అధికారి ముఖ్య సూచనలు:

* ప్రత్యామ్నాయ పంటల సాగు, భూగర్భ జలాల కొరతను అధిగమించడానికి వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, శనగ (బెంగాల్ గ్రామ్), కుసుమ (సాఫ్లవర్),  పొద్దు తిరుగుడు (సన్‌ఫ్లవర్) వంటి తక్కువ నీటి వినియోగం గల పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి పొందవచ్చని తెలిపారు.

* పంట వ్యర్థాలను కాల్చవద్దు: వరి కోతల తర్వాత పొలాల్లో మిగిలిన గడ్డిని (పంట వ్యర్థాలను) కాల్చడం వల్ల కలిగే దుష్ప్రభావాలను రైతులకు వివరించారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం పూర్తిగా దెబ్బతింటుందని, రైతుకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని, పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని హెచ్చరించారు. గడ్డిని కాల్చకుండా భూమిలోనే కలియదున్ని సేంద్రీయ ఎరువుగా మార్చుకోవాలని కోరారు.

అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏజెన్సీల నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే తూకం వేసి కొనుగోలు చేయ్యాలని స్పష్టం చేశారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి శివరత్, PACS బొక్కాస్‌గావ్  నిర్వాహకులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు