నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి
28-10-2026 | 05:12pm
నిర్మల్ అక్టోబర్ 28 ( విజయక్రాంతి): కుంటాల మండలంలోని కల్లూరు కి చెందిన రజక సంఘం సభ్యులు(Members of the Rajaka Association) సంఘ భవనానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ కు(MLA Pawar Ramarao Patil) వినతి పత్రం అందించారు. వెంటనే ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ దశలవారీగా రజక సంఘ భవన నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పారు.
అందరు కలిసి ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని సూచించారు. వారితో కాసేపు మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కుంటాల మండల బిజెపి నాయకులు నవీన్ తో పాటు, వార్డ్ సభ్యులు, రజక సంఘం నాయకులు ఉన్నారు