టీఎంయూ ఆవిర్భావ దినం
27-11-2026 | 05:32pm
నిర్మల్ నవంబర్ 27 ( విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో(RTC Bus Depot) వద్ద తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) 16వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపో అధ్యక్షుడు హన్మంతు, కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎంయూ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగుల సంక్షేమం కోసం యూనియన్ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కార్యదర్శి గంగాధర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పోశెట్టి, రాజేశ్వర్, జహీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.