టి యు డబ్ల్యూ జే మహాసభలను జయప్రదం చేయండి
డిసెంబర్ ఒకటిన ఆర్కే కన్వెన్షన్ హాల్లో మహాసభలు
ఖానాపూర్ (విజయక్రాంతి ): నిర్మల్ జిల్లాలో డిసెంబర్ ఒకటిన జరగనున్న టీయూడబ్ల్యూజే మహాసభలను (TUWJ General Conference) జయప్రదం చేయాలని ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు గాండ్ల రాజశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖానాపూర్ విశ్రాంతి భవనంలో గోడప్రతులను ఆవిష్కరించారు.
జిల్లా కేంద్రంలో ఆర్కే కన్వెన్షన్ హాల్లో మహాసభలు ఉంటాయని, జర్నలిస్టుల సంక్షేమానికి పనిచేస్తున్న సంఘం మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు తక్కల్ల రవీందర్, కార్యదర్శి గడబోయిన అశోక్ ,సట్ల శంకర్, బండపాటి సంతోష్, నిమ్మతోట రాకేష్, నరేష్ ,కోళ్ల రాజేష్, సాకేత్ ,పర్వేజ్, కైసర్ ,సిరి గారపు శంకర్, మొగిలి నరసయ్య, నగేష్, పవన్ ,పలువురు పాత్రికేయులు ఉన్నారు.