వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన సదస్సు
నిర్మల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 72వ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మలక్ చించోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ(Wildlife Conservation)పై అవగాహన కల్పించారు.
విద్యార్థులకు వన్యప్రాణుల ప్రాముఖ్యత, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో విద్యార్థుల పాత్ర తదితర అంశాలపై ఉపన్యాసం, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు మరియు మెమెంటోలు అందజేయనైనది.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ రావు, అటవీ క్షేత్రాధికారి, నిర్మల్, మహ్మద్ నజీర్ ఖాన్, ఉప అటవీ క్షేత్రాధికారి, సారంగాపూర్, పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయులు, ఇనాయతుద్దీన్, సీనియర్ అసిస్టెంట్, వెన్నెల, సుజాత అటవీ సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.