బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్గా దేవభక్తుని ప్రమాణ స్వీకారం
బోధన్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Bodhan Agricultural Market Committee) చైర్మన్గా దేవభక్తున్ నాగేశ్వరరావు(Devabhaktuni Nageswara Rao) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించిన ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి(Sudarshan Reddy) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ పెద్దలకు, మార్కెట్ కమిటీ వర్గాలకు ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల సంక్షేమమే(Welfare of farmers) లక్ష్యంగా పనిచేస్తానని, వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు(Farmers) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవభక్తున్ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ విజయకుమారి, మున్సిపల్ కమిషనర్, జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.