ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.3.60 కోట్ల నిధులు
బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): బోధన్, సాలూర మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి(Development of Government Schools) ప్రభుత్వం రూ.3 కోట్ల 60 లక్షల నిధులు మంజూరు(Funds worth lakhs sanctioned) చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించేందుకు ఈ నిధులు కేటాయించారు. బోధన్, సాలూర మండలాల పరిధిలోని పలు పాఠశాలలకు ఈ నిధులు కేటాయించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాలూర మండలానికి రూ.2.10 కోట్లు
సాలూర మండలంలోని పాఠశాలలకు మొత్తం రూ.2 కోట్ల 10 లక్షలు కేటాయించారు. ఇందులో మండూరు పాఠశాలకు రూ.15 లక్షలు, సాలూర ఎం.పి.పి.ఎస్‌కు రూ.15 లక్షలు, సాలూర జెడ్పీహెచ్‌ఎస్‌కు రూ.75 లక్షలు, హస్పాకు రూ.90 లక్షలు, కుమ్మన్‌పల్లికి రూ.15 లక్షలు కేటాయించారు.
బోధన్ మండలానికి రూ.1.50 కోట్లు
బోధన్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం రూ.1 కోటి 50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో బోధన్ ఉర్దూ పాఠశాలకు రూ.15 లక్షలు, పెంటాఖుర్ద్కు రూ.45 లక్షలు, కాళ్దుర్కికి రూ.45 లక్షలు, అమ్మదాపూర్కు రూ.45 లక్షలు కేటాయించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.3.60 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి బోధన్, సాలూర మండలాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.