ఆడపిల్లల కళ్యాణానికి వరం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి
- తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ప్రభుత్వ లక్ష్యం
- రైతు బాగుపడాలనేది ప్రభుత్వ ఆశయం
- కోటి 40 లక్షల కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన
- రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): ఆడపిల్లల కళ్యాణానికి వరం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకమని('Kalyana Lakshmi - Shaadi Mubarak' scheme) రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సుల్తానాబాద్ మండలం తో పాటు ఎలిగేడు మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ తో పాటు సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికులకు దుస్తులు పాదరక్షలను అందించారు.
సమావేశానికి ముందు మండల ప్రజల కు సద్దుల బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం 500 కు గ్యాస్ సిలిండర్, సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్విరామం రాష్ట్రం అభివృద్ధి తో పాటు ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారని అందులో భాగంగానే రైతుల వడ్ల సన్న వడ్లకు బోనస్ అందిస్తూ కొనుగోలు చేపడుతూ రైతులకు మద్దతు ధర అందిస్తున్నారని వివరించారు. మీ ఎమ్మెల్యేగా విజయ రమణారావు అండగా ఉన్నంతకాలం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాటుపడతారని పదవిలో ఉన్న లేకున్నా రైతుల, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
రైతులు రానున్న ఏ సంగీ లో ఎట్టి పరిస్థితుల్లో వరి పొలాలు వేయవద్దని ఎలినోవా ప్రభావంతో తీవ్ర ఎండలు వీచే అవకాశాలు ఉన్నాయని తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు వేసిన పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వరి కి బదలు ఆరుతడి పంటలు వేసి లబ్ధి పొందాలని ఏ పంట వేసినా ప్రభుత్వంతో తాను కొనుగోలు చేపిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం లబ్ధిదారులకు సుల్తానాబాద్ 126 , ఎలిగేడు 14 కోటి 40 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ చేపట్టారు.మున్సిపల్ కార్మికులకు దుస్తులు పాదరక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, తాసిల్దార్ బషీరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ టి రమేష్, సుల్తానాబాద్ ఎలిగేడు మండలాల సింగిల్ విండో చైర్మన్ లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.