ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల(Paddy Procurement Centers)ను శనివారం స్థానిక నాయకులతో కలసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు(MLA Vijayaramana Rao) మాట్లాడుతూ... రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని అన్నారు... ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సీఈవో బూరుగు సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.