అప్పోజిగూడలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎంపీ నిధులు రూ.10 లక్షలతో యూజీడీ, సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మొయినాబాద్ నవంబర్ 21(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ(Moinabad Municipality) పరిధిలోని 19వ వార్డు అప్పోజిగూడలో రూ.10 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ), సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం, రాష్ట్ర సీనియర్ నాయకుడు కంజర్ల ప్రకాష్, ఎస్. ప్రభాకర్ రెడ్డి, కే. శ్రీశైలం యాదవ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుందె గణేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పడమటి మమత, మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్, వైస్ చైర్మన్ గరుగు రాజు పాల్గొన్నారు.
అలాగే కౌన్సిలర్లు సదువు శ్రీలత రామచందర్, గునుగుర్తి శిరీష కిరణ్, గౌర అనసూయ నరసింహ, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోర్కంటి రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ కల్లెంల జగపతి మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందించిన నిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించి వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.